పెట్రోలు, డిజిల్ పై రూపాయి పెంచితే కొందరు గుండెలు బాదుకుంటున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. గతంలో అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు రూ. 2 వడ్డిస్తే ఎవరికి కనిపించలేదన్న ఆయన మోడీ ఇప్పటి వరకు డిసెంబర్ నుంచి రూ. 10 పెంచితే ఎవరికి కనపడలేదని అన్నారు. రోడ్ల మరమ్మతులు నిర్మాణం కోసం అని జీవోలో ప్రస్తావించారని అదే విషయం ఆర్డినెన్సులో స్పష్టంగా ఉందని అన్నారు. రోడ్లు నిర్మాణం కోసం మాత్రమే ఈ పన్ను వసూలు చేస్తున్నామని ఆయన అన్నారు.
మా ఎంపీలు జీఎస్టీ గురించి, ఇతర హామీల గురించి కేంద్రాన్ని నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఫైబర్ గ్రిడ్ అవినీతిపై సీబీఐ విచారణ గురించే మేము కోరామని పేర్ని నాని పేర్కొన్నారు. రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేసుకున్న ఏ వ్యవస్థైనా దానికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని అన్నారు.