లోకేష్ రాజకీయ నిరుద్యోగి.. గడ్డం పెంచిన వాడల్లా గబ్బర్ సింగ్ కాలేడు : ఏపీ మంత్రి సెటైర్

-

టీడీపీ నేత నారా లోకేష్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని తనదైన స్టైల్‌ లో సెటైర్లు వేశారు. లోకేష్ ఉద్యోగం ఓడిపోయిన రాజకీయ నిరుద్యోగి…ఇప్పుడు ఉద్యోగం కోసం తాపత్రయపడుతున్నాడని.. జూనియర్ ఎన్ఠీఆర్ వస్తాడేమో అనే భయంతో విచక్షణ మరిచి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చుట్టూ ఉన్న 10 మందితో చప్పట్లు కొట్టించుకోవడం కాదని… 5 కోట్ల ఆంధ్రులతో చప్పట్లు కొట్టించుకోగలగాలని చురకలు అంటించారు. భయపడి చచ్చే వారే ఛాలెంజ్ చేస్తున్నారు…లెక్కలు తీయడం మొదలెడితే కక్ష సాధింపు అంటారని.. గడ్డం పెంచిన వాడల్లా గబ్బర్ సింగ్ కాలేడని సెటైర్‌ వేశారు. తాను చెప్పిన ఉద్యోగాలన్నీ రాబోయే రోజుల్లో సీఎం అమలు చేస్తారని.. ఈ రోజు ఉన్న ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇది అని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో పరిస్థితి మారొచ్చు… యువత నిరుత్సాహ పడొద్దు…రానున్న రోజుల్లో మంచి జరుగుతుందన్నారు. ఒక ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయాలు చేసే తుచ్ఛ సంస్కృతి లోకేష్ ది అని.. ఈ సమాజంలో మృగాలు ఉన్నాయి…మేమేం చర్యలు తీసుకోకపోతే తప్పు అని పేర్కొన్నారు. వాళ్ళని వేటాడతాం.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి పేర్ని నాని. వైఎస్ జగన్ హయాంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుందని.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన లోకేష్ ఇలాంటి దౌర్భాగ్య స్థితికి వెళ్లడం శోచనీయమని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version