RRR Cinema : గన్‌తో ఫ్యాన్.. ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్ వద్ద హల్ చల్..

-

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఫిల్మ్ చూసేందుకు అభిమానులు వస్తున్నారు. తమ అభిమాన కథానాయకుల కటౌట్లకు, బ్యానర్లకు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. మెగా, నందమూరి అభిమానులు కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం.. సినిమా సూపర్ హిట్ అని తేలిపోయింది.

ఇక సినిమా థియేటర్స్ వద్ద అభిమానుల హల్ చల్ మామూలుగా ఉండబోదు. కానీ, ఓ థియేటర్ వద్ద అభిమానం హద్దులు దాటిపోయినట్లు కనబడుతున్నది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ప్రదర్శితమయ్యే ఓ థియేటర్ దగ్గర అభిమాని గన్ తో హల్ చల్ చేశాడు. సినిమాకు వెళ్లే ముందర బయట గన్ తో ఫోజులిచ్చాడు. వివరాల్లోకెళితే.. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణ థియేటర్‌లో ఈ ఘటన జరిగింది.

‘ఆర్ఆర్ఆర్ ’ చిత్రం చూసేందుకు వచ్చిన ఓ అభిమాని థియేటర్ లోపలికి వెళ్లే ముందర గన్ చూపించి హల్ చల్ చేశాడు. మీడియా వారు అతని ఫొటోలు తీశారు. ఇక సినిమా ప్రదర్శితమవుతున్న సమయంలోనూ సదరు వ్యక్తి గన్ తో అటు ఇటు తిరుగుతూ కేరింతలు కొట్టినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి పిఠాపురానికి చెందిన హసామి అని అక్కడి వారు చెప్తున్నారు. కాగా, పొరపాటున థియేటర్‌లో బుల్లెట్ పేలితే పరిస్థితేంటని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version