దానిమ్మలో పురుగు నివారణ చర్యలు ..తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు..

-

దానిమ్మ పంట మన దేశ వ్యాప్తంగా పండిస్తున్నారు..ఇది ప్రపంచంలోని ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో ఇష్టమైన టేబుల్ ఫ్రూట్..ప్రతి ఒక్కరూ ఈ కాయలను ఇష్టంగా తింటారు..

ఈ పండు టేబుల్ ఫ్రూట్‌గా ఉపయోగించడంతో పాటు దాని చల్లని మరియు రిఫ్రెష్ జ్యూస్ కోసం ఇష్టపడుతుంది.పండ్లు చక్కెరలు (14-16%), ఖనిజాలు (0.7-1.0%) మరియు ఐరన్ (0.3-0.7 mg/100 గ్రా.) యొక్క మంచి మూలం. ఏపీ లో అనంతపురం, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాలలో పండిస్తారు. ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా దానిమ్మ తోటలకు భారీ నష్టం వాటిల్లింది.

పురుగు పట్టిందని ఎలా గుర్తించాలి..?

*. ఆడపురుగు గోధుమ నీలిరంగు కలిగి ముందుజత రెక్కలపైన నారింజరంగు మచ్చ వెనుకజత రెక్కలపైన నల్లటి మచ్చలు ఉండును.

*. మగపురుగులు నీలిరంగులో ఉండును.
*. లద్దెపురుగు నలుపు గోధుమరంగులో ఉండి శరీరంపై తెల్లటి మచ్చలు మరియు సన్నని వెంట్రుకలుండును.
వీటి చర్యలు..

లద్దెపురుగు కాయలలోకి ప్రవేశించి లోపలి మెత్తటి భాగమును తినును. కాయపైన రంధ్రాన్ని పురుగు విసర్జించిన మలంతో కప్పి వేయును.

ఈ రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా, బూజు తెగుళ్ళు వ్యాపించి కాయలు క్రమేపి క్రుళ్ళి రాలిపోవును..
తల్లి పురుగు పూల పైన, కాయల పైన గుడ్లు పెడతాయి..లద్దెపురుగులు 30-40 రోజులు పెరిగి కాయలలోపలగాని, కాయకాడపైన గాని కోశస్థదశలో ప్రవేశించును.జీవితచక్రం 30-60 రోజులలో పొదుగును.
నివారణ చర్యలు:

కాయలను కాగితం లేదా పాలిథిన్ సంచితోగాని కప్పవలెను. దీనివల్ల గ్రుడ్లను పెట్టుట నివారించవచ్చు.

చెట్టుపూత, మొగ్గ దశలో ఉన్నప్పుడు ఎండోసల్ఫాన్ 2ml/Lt కలిపి పిచికారి చేయాలి. ఆ తర్వాత 15-20 రోజుల తరువాత కార్బరిల్ 3gr/Lt పురుగు మందును పిచికారి చెయ్యవలెను..

Read more RELATED
Recommended to you

Exit mobile version