దేశంలో చమురు ధరలు మండిపోతున్నాయి. వరుసగా ఆరు రోజుల్లో ఐదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను ఇవాళ మరోసారి పెంచేశాయి. దీనితో వాహనదారుల పై ఎఫెక్ట్ పడుతుంది.
ఇక మరి తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎంత మేర పెరిగాయో చూసేద్దాం. హైదరాబాద్‌లో శని వారం పెట్రోల్ ధర 50 పైసలు పెరిగగా…డీజిల్ ధర 55 పైసలు పెరిగింది. దీనితో పెట్రోల్ ధర లీటరుకు రూ.112.37కు ఎగసింది. అలాగే.. డీజిల్ రేటు లీటరుకు రూ. 98.70 కు పెరిగింది.
ఏపీ ముఖ్య నగరమైన విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.114.06 కాగా..లీటర్ డీజిల్ ధర రూ.100.04 గా నమోదు అయింది. అలాగే… విశాఖ పట్నం లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.03 కాగా..లీటర్ డీజిల్ ధర రూ. 112.09 గా నమోదు అయింది. అటు చిత్తూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.114.43 కాగా..లీటర్ డీజిల్ ధర రూ. 113.24 గా నమోదు అయింది.