మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అసలు తగ్గేలా కనిపించడం లేదు. రోజురోజుకు పెరగడమే తప్ప… ఎక్కడా కూడా తగ్గుదల అనేది లేకుండా పోయింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటగా… డీజిల్ ధరలు కూడా సెంచరీ దాటుతున్నాయి. ఇక తాజాగా మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 0.35 పైసలు మరియు లీటర్ డీజిల్ పై 0.35 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.84 కు చేరగా డీజిల్ ధర రూ. 94.57 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110. 09 కు చేరగా డీజిల్ ధర రూ. 103 . 18 కు పెరిగింది.
ముంబై లో రూ. 111.77 , కు చేరగా డీజిల్ ధర రూ. 102.52 కు పెరిగింది. కోల్ కతాలో రూ . 106.43 కు చేరగా డీజిల్ ధర రూ. 97 .68 కు పెరిగింది. చెన్నైలో రూ .103. 01 కు చేరగా డీజిల్ ధర రూ. 98.92 కు పెరిగింది.ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112. 38 కు చేరగా డీజిల్ ధర రూ. 104. 83 కు చేరుకుంది.