పీఎఫ్ అకౌంట్ ఉందా..? అయితే అకౌంట్లలోకి రూ.81 వేలు పడ్డాయో లేదో ఇలా చూడండి..!

-

పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్ళకి గుడ్ న్యూస్. పీఎఫ్ వడ్డీ డబ్బులు పీఎఫ్ అకౌంట్ ఉన్నవారి ఖాతా లో జమ అవుతున్నాయి. 8.1 శాతం వడ్డీని పీఎఫ్ ఖాతాదారులకు ఇస్తున్నారు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ డబ్బులను ఇప్పుడు ఖాతా లో జమ అవుతున్నాయి. ఈపాటికే ఈ డబ్బులు మీకు అందివుండచ్చు.

ఎవరికి ఎంత వస్తున్నాయంటే..?

రూ.10 లక్షలు కనుక ఖాతా లో ఉంటే రూ. 81 వేలు లభిస్తాయి.
అదే ఏడు లక్షలు కనుక మీ ఖాతా లో ఉంటే అప్పుడు మీకు రూ. 56,700 వరకు లభిస్తాయి.
రూ. 5 లక్షలు ఉంటే అప్పుడు 40,500 వరకు లభిస్తాయి.
రూ. లక్ష కనుక ఉంటే.. మీకు రూ. 8,100 వరకు వడ్డీ డబ్బులు వస్తాయి.
ఇలా మీ అకౌంట్ లో వుండే డబ్బులని బట్టి డబ్బులు వస్తాయి. ఇప్పుడు పీఎఫ్ అకౌంట్‌పైన 8.1 శాతం వడ్డీ లభిస్తోంది.

ఎలా డబ్బులని చెక్ చేసుకోవాలి..?

ఇది ఇలా ఉంటే మీ అకౌంట్ లో ఆ డబ్బు పడిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు వచ్చాయా లేదా అనేది ఒక్క మిస్డ్ కాల్‌తో ఈజీగా తెలుసుకోవచ్చు. 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. లేదు అంటే ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి కానీ ఉమాంగ్ యాప్ ద్వారా ఈ సందేహాన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version