కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో ఈటల భేటీ

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మునుగోడు ఉప ఎన్నికకు నిన్నటి తెరపడింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. అయితే.. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలుపొందారు. అయితే.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉపపోరులో బీజేపీ, కాంగ్రెస్‌లకు షాకిస్తూ.. కారు జోరు చూపిచింది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహిరిస్తున్నారు. చేరికల కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న ఆయన మునుగోడు ఉప ఎన్నికల ప్రక్రియ మెుదలైనప్పటినుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలను బీజేపీలో చేర్చుకున్నారు.

ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి విజయం కట్టబెట్టి వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించటమే లక్ష్యంగా శ్రమించారు. ఈటలకు ఈ నియోజకవర్గంలో బంధుగణం ఉండటంతో ప్రత్యేక దృష్టి సారించి కోమటిరెడ్డి విజయానికి వ్యూహాలు రచించారు. కానీ వ్యూహాలు బెడిసికొట్టాయి. ఈటల అత్తగారి గ్రామమైన పలివెలలో బీజేపీ మెజార్టీ సాధించినా.. కేసీఆర్ వ్యూహాల ముందు బీజేపీ పాచికలు పారలేదు. అన్ని మండలాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ అధికార టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేసింది.

ఓటమి తర్వాత మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఈటల రాజేందర్‌ కలిశారు. ఈ సందర్భంగా ఉప ఎన్నిక ఫలితంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. మండలాల వారీగా ఫలితాలపై ఆరా తీశారు. ఈ ఎన్నికలో ఓటమి చెందినప్పటికి నైతిక విజయం మాత్రం బీజేపీదేనని అన్నారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version