పీఎఫ్ఐ ఆఫీసులకు సీల్.. ఆ రాష్ట్రాల్లోనూ నిషేధం..!

-

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్ఐపై ఇప్పటికే కేంద్రం నిషేధం విధించింది. మరోవైపు, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా పీఎఫ్ఐపై నిషేధాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. పీఎఫ్ఐని చట్టవ్యతిరేక సంస్థగా పేర్కొంటూ నోటిఫికేషన్ రిలీజ్ చేశాయి. సంస్థ కార్యకలాపాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు, పోలీసులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం సైతం పీఎఫ్ఐని చట్టవ్యతిరేక సంస్థగా నోటిఫై చేసింది. ఇక, కర్ణాటకలోని పీఎఫ్ఐ కార్యాలయాలను పోలీసులు మూసేశారు. ఒక్క మంగళూరు నగరంలోనే 12 కార్యాలయాలకు సీల్ వేశారు. ఇందులో పీఎఫ్ఐ విద్యార్థి విభాగమైన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయం సైతం ఉందని పోలీసులు తెలిపారు.

కేంద్రం చర్య నేపథ్యంలో తమ విభాగాలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నట్లు పీఎఫ్‌ఐ నిన్న వెల్లడించింది. అయితే నిషేధంపై ఆ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version