మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 21, 2021. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాల్లో కలిపి 59 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక వయస్సు వివరాలలోకి వెళితే.. అభ్యర్థుల గరిష్ట వయసు 42 ఏళ్లు మించి ఉండ కూడదు.
అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తుకు అప్లై చేయాలనుకొన్నఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు సమాచారం కోసం ముందుగా అధికారిక వెబ్సైట్ https://visakhapatnam.ap.gov.in/ ను సందర్శించాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే..
దరఖాస్తు చేసుకొనే వారు ముందుగా అధికారిక వెబ్సైట్ను https://visakhapatnam.ap.gov.in/ సందర్శించాలి
నోటిఫికేషన్ను పూర్తిగా చదవాలి.
నెక్స్ట్ మీరు వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, అనంతరం అప్లికేషన్ ఫాం నింపాలి.
రూ.300 ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ప్రాసెస్ ని పూర్తి చేయాలి.
డీఎంహెచ్ఓ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి దారస్తులని పంపాలి.