ఢిల్లీ సీఎం చెంపపై కొట్టి దాడి చేసింది ఇతనే

-

ఢిల్లీ సీఎం రేఖ గుప్తాపై దాడి చేసిన నిందితుడికి సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. అతడి పేరు రాజేష్. సీఎం రేఖ చెంపపై రెండుసార్లు బలంగా కొట్టాడు. అంతే కాకుండా జుట్టు పట్టి పీకినట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఘటనలో సీఎం తలకు గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఉదయం 8:05-8:10 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.

Photo of the accused who attacked Delhi CM Rekha Gupta has surfaced
Photo of the accused who attacked Delhi CM Rekha Gupta has surfaced

ఈ ఘటన జరిగేటప్పుడు ఇతర వ్యక్తులు కూడా చూసినట్లుగా వారు చెబుతున్నారు. అయితే రాజేష్ దాడి చేయడానికి గల ప్రధాన కారణం రాజకీయ కుట్ర అని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన అనంతరం కొంతమంది నెటిజన్లు రాజేష్ పై ఫైర్ అవుతున్నారు. స్త్రీ అని కనీస మర్యాద లేకుండా ఇలా దాడి చేయడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతడిని అరెస్టు చేసి శిక్ష విధించాలని కొంతమంది అంటున్నారు. ఈ విషయం పైన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news