
భూదందాలు, కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రెస్, పరిచయం అవసరం లేని పేరు గ్యాంగ్ స్టర్ నయీం… ఎందరికో చుక్కలు చూపించి, చిక్కులు పెట్టి, ప్రాణాలు తీశాడు. చివరికి పాపాలు పండి తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ అయ్యాడు. ఇక నయీంకు పోలీసు శాఖలో రెవెన్యూ శాఖలో ఇతర అధికార వర్గాల్లో ఉన్న ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు అనుకూలంగా ఇప్పుడు నయీం కేసులో కొత్త మలుపులు బయటపడుతున్నాయి. నయీంతో చేతులు కలిపి అక్రమాలు చేసిన వారి జాతకాలు కూడా బయటపడబోయేలా ఉన్నాయి. తాజాగా నయీంతో పోలీస్, రెవెన్యూ అధికారులు దిగిన ఫోటోలను లోక్ పాల్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించనుంది. ఆర్టీఐ చట్టం కింద ఈ సమాచారాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సేకరించింది. నయీంతో చేతులు కలిపిన వారి ఫోటోలు లభ్యమవ్వడం వల్ల అతనితో కుడి అక్రమాలు చేసినవారి బండారం బయటపడేలా సూచనలు కనపడుతున్నాయి. త్వరలో వారి పై కూడా విచారణ జరపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లోక్ పాల్ ను కొరనుంది.