ముంబాయి లో రామ్ చ‌ర‌ణ్ వైర‌ల్ అవుతున్న ఫోటోలు

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ RC15 షూటింగ్ లో భాగంగా ముంబాయి న‌గ‌రానికి వెళ్లాడు. అయితే తమిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కు వ‌ర్కింగ్ టైటిల్ గా RC15 గా ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా త‌న మొద‌టి షెడ్యూల్ ను అక్టొబ‌ర్ 2 ముగించుకుంది. ఈ మొద‌టి షెడ్యూల్ లో ఎక్కువ భాగాన్ని పూణే లో షూట్ చేశారు.

ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ కోసం చిత్ర బృందం ముంబాయి కి చేరుకుంది. అయితే శంకర్ ఒక తెలుగు హీరో కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం ఇదే మొద‌టి సారి. దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీ గా పెరిగి పోతున్నాయి అలాగే ఈ సినిమా లో యాంక్ష‌న్ సీన్ లు కూడా ఎక్కువ గానే ఉంటాయ‌ని స‌మాచారం. ఈ సినిమా లో హీరోయిన్ గా కియారా అద్వానీ న‌టిస్లున్నారు. అలాగే సునీల్, నీవ‌న్ చంద్ర‌, అంజ‌లి, జ‌య‌రామ్ లు ముఖ్య పాత్ర లో క‌నిపించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news