నదిలో కుప్పకూలిన విమానం.. ఆరుగురు పోలీసులు మృతి

-

నదిలో మినీ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దక్షిణ థాయిలాండ్‌లో శుక్రవారం ఉదయం సంభవించింది. ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు పోలీస్ అధికారులు తమ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

విమానం నదిలో కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలతో బయట పడలేకపోయారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానంలోని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అయితే, సాంకేతిక కారణాల వల్లే విమాన ప్రమాణం సంభవించినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనతో దక్షిణ థాయిలాండ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ దేశ ప్రభుత్వం మృతులకు సంతాపం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news