ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనం కేసులో విచారణను వేగవంతం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి సీఐడీ కార్యాలయంలో ఈ విచారణ సాగుతోంది. ఆయనను సాయంత్రం పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరు పరచనున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో వంకరెడ్డి మాధవరెడ్డిని గురువారం సీఐడీ పోలీసులు అరెస్టు చేసారు. ఈ ఘటనలో ప్రధాన కుట్రదారుగా ఆయన పై సీఐడీ అభియోగాలుు మోపింది. మాధవరెడ్డి నెల రోజులుగా పరారీలో ఉన్నారు. పట్టుకునేందుకు మదనపల్లెలో ఆయన నివాసం వద్ద సీఐడీ అధికారులు నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికీ చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు వద్ద తన ఫాంహౌస్ లో ఉన్నారనే సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు.