దేశంలో మహిళలు రోజురోజుకు దారుణాలకు పాల్పడుతున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను చంపేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రోజుకొకటి తెరపైకి వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో మరో సరికొత్త ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. పేకాట ఆడుతోందని తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త.
వైజాగ్‌లో భార్య రోజు పేకాట ఆడుతుందని పోలీసులకు ఫిర్యాదు చేసాడు భర్త. లలిత్ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు ఆరుగురు మహిళలు.
భర్త ఫిర్యాదుతో పేకాట స్థావరంపై దాడి చేసారు టాస్క్ ఫోర్స్, ఫోర్త్ టౌన్ పోలీసులు. ఈ సంఘటన లో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకొని, రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు.