గువ్వల బాలరాజుకు షాక్ ఇచ్చారు BRS కార్యకర్తలు.త మను సంప్రదించకుండా ఎలా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తావని గువ్వలపై ఎదురుతిరిగారు ఆయన అనుచరులు. గువ్వల తన నివాసంలో సమావేశం పెట్టగా, అంతంత మాత్రంగా వచ్చారు కార్యకర్తలు. గువ్వల నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక ఫంక్షన్ హాల్‌లో సమావేశం పెట్టుకున్నారు అనుచరులు, కార్యకర్తలు.

అనూహ్యంగా ఈ సమావేశానికి ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వెళ్లడంతో కంగుతిన్నారు గువ్వల బాలరాజ్. గువ్వల గెలుపు కోసం శాయశక్తులా కష్టపడ్డ తమను పట్టించుకోకుండా వెళ్లిపోయిన గువ్వలకు బుద్ది చెప్తామన్నారు అనుచరులు. గువ్వలను పార్టీ వీడవద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు కొందరు కార్యకర్తలు.
గువ్వల బీజేపీలోకి వెళ్తే తన రాజకీయ భవిష్యత్తు సమాధి చేసుకున్నట్లే అని హెచ్చరించారు అనుచరులు. ఇది ఇలా ఉండగా రేపు.. అచ్చంపేటకు వెళ్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా గులాబీ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. గువ్వల బాలరాజు బయటకు వెళ్లిన నేపథ్యంలో.. అచ్చంపేటలో గులాబీ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా దిశా నిర్దేశం చేయనున్నారు హరీష్ రావు.