పులివెందుల ZPTC ఉప ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచుకోట అని వెల్లడించారు. దాన్ని మరోసారి నిలబెట్టడానికే ఎన్నికల ప్రచారానికి వచ్చాను అన్నారు. ఇక్కడ పోటీ చేస్తోంది బీటెక్ రవి భార్య కాదు, పరోక్షంగా చంద్రబాబే పోటీ చేస్తున్నాడని చురకలు అంటించారు.

మేము కూడా కుప్పంలో అనేక స్థానాలు గెలిచామన్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబే చెప్పాడు నిధులన్నీ పులివెందులకేనా అని…మరి ఇప్పుడెలా అభివృద్ధి చేయలేదని మాట్లాడతారు? అని నిలదీశారు. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసు అన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.