అతడి నాయకత్వంలో ఆడటం బాగుంది :జస్‌ప్రీత్ బుమ్రా

-

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరడంలో జస్‌ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకొచ్చి రన్స్ నియంత్రించడంతోపాటు కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ తనపై పెట్టుకున్న అంచనాలను వందశాతం అందుకొన్నాడు జస్‌ప్రీత్ బుమ్రా. ఇక తాజాగా బుమ్రా రోహిత్ శర్మ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఐసీసీ షేర్‌ చేసిన ఈ వీడియోలో బుమ్రా మాట్లాడుతూ… సహచర ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంలో రోహిత్ శర్మ ముందుంటాడని బుమ్రా వ్యాఖ్యానించాడు.

”రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. ఆటగాడిగానూ రాణిస్తూ జట్టును నడిపించడం చిన్న విషయం కాదు. గత ప్రపంచ కప్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. ఇప్పుడు ప్రతీ మ్యాచ్‌లో ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేసింది అని ప్రశంసల వర్షం కురిపించారు. రోహిత్ శర్మ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. వారు ఏం చెప్పాలనుకున్నా ఇబ్బందిలేకుండా చూస్తాడు అని తెలిపారు. అతడి అనుభవాలను మ్యాచ్‌ సమయంలో ప్లేయర్లతో పంచుకుంటాడు. అతడి నాయకత్వంలో ఆడటం బాగుంది అని అన్నారు. జట్టులోని ప్రతిఒక్కరి ఆత్మవిశ్వాసం అత్యుత్తమంగా ఉంది” అని బుమ్రా తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news