రేపు సికింద్రాబాద్ 10వ నంబర్ ఫ్లాట్ ఫామ్ మూసివేత

-

సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో 10వ నంబర్ ప్లాట్ ఫాంను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం మధ్యా్హ్నం ఒంటి గంట వరకు టికెట్ బుకింగ్ కౌంటర్, క్యాటరింగ్ స్టాల్స్, వెయిటింగ్ హాల్స్ సహా అన్ని మూసివేయనున్నారు. ఈ సమయంలో ప్లాట్ ఫాంపైకి ప్రయాణికులను ఎవర్నీ అనుమతించమన్నారు. అంతేకాకుండా.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రైల్వేస్టేషన్‌లోని 10వ నంబర్ ఫ్లాట్ ఫాం వద్ద ఆధునీకరణ పనులను మోడీ ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో 715 కోట్లతో రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించనున్నారు.

మోడీ టూర్ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని పోలీసులు తెలిపారు. ‌ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటా 30నిమిషాల వరకు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ప్రధాని సభకు జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల వెహికల్స్‌కు దోబీఘాట్‌‌‌‌‌‌‌‌, బైసన్ పోల్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌, కంటోన్మెంట్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌, నెక్లెస్‌‌‌‌‌‌‌‌ రోడ్​లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఇతర మార్గాల్లో ట్రావెల్ చేయాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version