అన్నదాతలకు గుడ్ న్యూస్.. అకౌంట్ లో డబ్బులు..!

-

అన్నదాతలకు గుడ్ న్యూస్. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటికే చాలా మంది రైతులు సహాయాన్ని పొందుతున్నారు. అయితే పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులు అలర్ట్. 14వ విడత నిధుల విడుదల కి సంబంధించి ఓ విషయం బయట కి వచ్చింది. ఏ తేదీన డబ్బులు వస్తాయనేది తెలుస్తోంది. మరి ఇక పూర్తి వివరాలు చూస్తే.. జూలై 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నగదు అకౌంట్ లో జమ అవుతాయని తెలుస్తోంది.

రాజస్తాన్‌లోని సికార్‌లో జరగనున్న కార్యక్రమం వేదికగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు పీఎం మోదీ. అయితే రైతులు మాత్రం ఓ విషయం గుర్తుంచుకోవాలి. పీఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే, రైతులకు తగిన అర్హతలు పక్కా ఉండాలి. దాంతో పాటు కొన్ని పనుల్ని కూడా చేసేయాలి.

లేదంటే డబ్బులు పడవు. పీఎం కిసాన్ డబ్బులు పొందాలనుకునే రైతులు ఇ-కేవైసీ తప్పనిసరి. ఆన్‌లైన్‌ లోనే ఇ-కేవైసీ పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ లోనే సింపుల్‌గా ఇ-కేవైసీ పూర్తి చేయొచ్చు. భూమి పత్రాలను కూడా ధృవీకరించాలి. బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నంబర్‌ను లింక్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తి అయితే డబ్బులు వస్తాయి చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version