BREAKING : హైకోర్టు సంచలన తీర్పు…..కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు

-

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు ఊహించని షాక్‌ తగిలింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదంటూ ప్రకటన చేసింది కోర్టు.

దీంతో రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించింది కోర్టు. వనమా వెంకటేశ్వర్ రావు గెలుపును సవాల్ చేస్తూ 2018 లో హైకోర్టును ఆశ్రయించారు జలగం. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు జలగం వెంకట్రావ్. అయితే.. సమగ్ర విచారణ అనంతరం వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని తీర్పు నిచ్ఛింది హైకోర్టు. ఇక ఆయన సమీప అభ్యర్ధిగా జలగం వెంకటరావును విజేతగా ప్రకటించింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version