జగన్ పేదరికపు హాస్యం..ప్రజలు 2024 కోసం వెయిటింగ్.!

-

జగన్ ఈ మధ్య ఏ సభలో చూసిన పేదలకు, పెత్తందార్ల మధ్య యుధాం జరుగుతుందని, తాను పేదల పక్షాన ఉంటూ..వారికి అండగా ఉంటున్నానని, కానీ పెత్తందార్లు అయిన చంద్రబాబు, పవన్, టి‌డి‌పి మీడియా ఓ వైపు ఉంటూ తనపై దాడి చేస్తుందని జగన్ చెబుతున్న విషయం తెలిసిందే. తాను ఒంటరి అని, ప్రజలే అండగా ఉండాలని, ఆర్ధిక, అంగ బలం లేవని, మీడియా బలం లేదని చెబుతున్నారు.

మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో ప్రజలే తెలుసుకోవాలి. అయితే ఈ విషయం పక్కన పెడితే జగన్ పేదల మనిషి అని అంటూ డ్రామా ఆడుతున్నారని టి‌డి‌పి విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరరావు..జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. మొదట అమరావతిలో పేదవాళ్ళకు కోర్టులని దాటుకుని ఇళ్ళు నిర్మాణం చేస్తున్నామని జగన్ చెప్పారు. దానికి గంటా కౌంటర్ ఇస్తూ..”  అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో కోర్టు తుది ఉత్తర్వులు వెల్లడించకుండానే మీరు ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడమనేది నిరుపేదల జీవితాలతో ఆడుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక వేళ రేపు తుది తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆ సెంటు భూమిలో ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రజాధనానికి ఎవరు బాధ్యత వహిస్తారు” అంటూ ట్వీట్ చేశారు.

అలాగే పేదరికం అంటూ మాట్లాడుతున్న జగన్.. ‘‘ఒక పక్క… మీ స్వార్ధపూరిత రాజకీయ జిత్తులకు అమాయకమైన నిరుపేదలను బలిచేస్తూ. మరోపక్క…. నేను పేదల పక్షాన పోరాడుతున్నాను, రాష్ట్రంలో పేదలకు పెట్టుబడిదారులకు మధ్య వర్గపోరు నడుస్తోందంటూ.. దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్న మీరు చెప్పడం ఈతరానికి అతి పెద్ద పొలిటికల్ జోక్ జగన్ గారు…..!. ప్రతి మీటింగ్‌లో ప్రతి సారి నేను ఒక నిరుపేదని, నాకు అంగబలం లేదు, నాకు ఆర్థిక బలం లేదు, నాకు మీడియా బలం లేదు, నాకు మోసం చేయడం తెలియదు, నాకు నక్కజిత్తులు తెలియవు, నేను ఒక అమాయకుడుననే పేదరికపు హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారు. ప్రజలేమి అమాయకులు కాదు జగన్ గారు. తెలిసో, తెలియకో… 2019లో “ఒక్క అవకాశం” మాయలో పడి కోలుకోలేని అతి పెద్ద తప్పు చేశారనేది తెలుసుకున్నారు. విముక్తి కోసం అదే ప్రజలు ఎప్పుడు ఎప్పుడా అని 2024 కోసం ఎదురు చూస్తున్నారు’’ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి గంటా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version