కేంద్ర ప్రభుత్వం నుండి ”పీఎం మిత్ర”… ఎలాంటి లాభాలు పొందొచ్చు అంటే…?

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వస్తూనే వుంది. వీటి వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. ప్రధాని మోదీ దేశంలో తయారీ రంగం కోసం ఇప్పటికే పలు స్కీమ్స్ ని తీసుకు రావడం జరిగింది. మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌ వంటి పథకాలకు మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరో అడుగు ముందుకు వేస్తోంది.

ప్రపంచ టెక్స్‌టై ల్‌ మార్కెట్‌ లో భారత్‌ ని బలమైన భాగస్వామిగా చేయడానికి ఏడు రాష్ట్రాల్లో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ని ఏర్పాటు చేయనున్నట్టు మోదీ శుక్రవారం ప్రకటించడం జరిగింది. వివరాలని చూస్తే… ప్రధాని మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరల్‌ ఉద్దేశం ఆత్మనిర్భర్ భారత్‌ నిర్మాణమే అని అన్నారు. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 9ని సాధించడం కోసమే దీన్ని మొదలు పెట్టారు.

పీఎం మిత్ర పథకంలో భాగంగా ఏడు మెగా టక్స్‌టైల్‌ పార్కులను మొదలు పెట్టనున్నారు. తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు , మహారాష్ట్ర , గుజరాత్ , ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం మొత్తం రూ. 4,445 కోట్లు ఖర్చు చేయనున్నారు. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో సౌకర్యాలతో నిర్మిస్తానున్నారు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయని..

అంతర్జాతీయ విపణిలో దేశీయ వస్త్రాల వాటా కూడా పెరుగుతుంది. లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలని కూడా ఇస్తుంది. రూ.కోట్లలో పెట్టుబడులను కూడా ఆకర్షించవచ్చని అన్నారు. పార్కు ద్వారా లక్ష ప్రత్యక్ష ఉద్యోగాలు అలానే పరోక్షంగా మరో రెండు లక్షల ఉద్యోగాలకు ఛాన్స్ ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version