ఈ రోజు అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో అమెరికా అధ్యక్ష భవనంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల అల్లర్లు సంచలనం అయ్యాయి. ట్రంప్ వారిని కావాలనే ప్రేరేపించారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల నాయకులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు.
ఈ వార్తలను చూసి తాను బాధపడుతున్నానని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ మధ్య అధికారం బదిలీ శాంతియుతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “వాషింగ్టన్ డిసిలో అల్లర్లు మరియు హింస గురించి వార్తలు చూడటం బాధగా ఉంది. అధికారాన్ని క్రమబద్ధంగా మరియు శాంతియుతంగా బదిలీ చేయడం కొనసాగించాలి. చట్టవిరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయడానికి అనుమతించలేము” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
మోడీతో పాటు, ఇతర ప్రపంచ నాయకులు కూడా ఈ రోజు అమెరికా రాజధానిలో జరుగుతున్న హింస మరియు గందరగోళాని చూసి విస్మయం వ్యక్తం చేసారు. “యుఎస్ కాంగ్రెస్లో అవమానకరమైన దృశ్యాలు” అని యుకె ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ అన్నారు. “ట్రంప్ మరియు అతని మద్దతుదారులు చివరకు అమెరికన్ ఓటర్ల నిర్ణయాన్ని అంగీకరించి, ప్రజాస్వామ్యాన్ని తొక్కడం మానేయాలి” అని జర్మన్ విదేశాంగ మంత్రి హేకో మాస్ ట్విట్టర్‌లో రాశారు. ఈ నెల 20 న జో బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
Distressed to see news about rioting and violence in Washington DC. Orderly and peaceful transfer of power must continue. The democratic process cannot be allowed to be subverted through unlawful protests.
— Narendra Modi (@narendramodi) January 7, 2021