ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామని దమ్ముంటే ప్రకటించండి..

-

మహారాష్ట్రలోని భండారా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోడి ప్రసంగిస్తూ, ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్, ఎన్సీపీలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ అంటే మన దేశంలో ఒక భూభాగం మాత్రమే కాదని.. మన దేశానికి కిరీటమని ప్రధాని మోడి అన్నారు. ఆర్టికల్ 370 ద్వారా ఇంత వరకు జమ్మూకశ్మీర్ కు లభించిన ప్రత్యేక ప్రతిపత్తిని మళ్లీ తీసుకొస్తామని దమ్ముంటే మీ మేనిఫెస్టోలో పెట్టాలని సవాల్ విసిరారు.

ఆగస్టు 5 నాటి మా నిర్ణయాన్ని మారుస్తామని… ఆర్టికల్ 370 మళ్లీ తీసుకొస్తామని దమ్ముంటే ప్రకటించాలని ఛాలెంజ్ విసిరారు. ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ మాట్లాడుతున్నట్టుగానే ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయని మోడి దుయ్యబట్టారు. ఎన్సీపీ చేస్తున్న వ్యాఖ్యలు యావత్ దేశ ఆలోచనలకు విభిన్నంగా ఉన్నాయని అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న ఫడ్నవిస్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version