సుదీర్ఘకాలం కాలం కొనసాగిన అయోధ్యలోని బాబ్రీ మసీదు, రామజన్మభూమి భూవివాదం కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే అయోధ్యలోని వివాదాస్పద రామాలయ నిర్మాణం అంశంపై నేడు సుప్రీం కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభంకానుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అయోధ్యలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విజయదశమి సందర్భంగా కోర్టుకు సెలవలు కావడంతో కేసు విచారణ వారం రోజులకు వాయిదా పడింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. నేడు ఈ కేసుకు సంబంధించి ముస్లీం మత పెద్దల వాదనలు జరగనున్నాయి. ఈనెల 16తో హిందూ వర్గాల వాదనలు ముగించాలని అత్యున్నత న్యాయ స్థానం నిర్ణయించింది. మరుసటి రోజు ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఆశ్చర్యంగా అదే రోజు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ కూడా చేయనున్నారు.