రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన బీజేపీ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఆయననే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో సంభాషణ చాలా అద్భుతంగా జరిగింది. ప్రజా సేవకు సంబంధించివారి అభిప్రాయాలు, అభిరుచులు వినడం చాలా అద్భుతంగా ఉంది. ఇది విభిన్నమైన ఎంపీలతో ఉన్న బృందం. పార్లమెంటరీ కార్యకలాపాలను కచ్చితంగా పాటించేట్లు కృషి చేస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు. కాగా, రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వారిలో 45 మంది సభ్యులు బుధవారం ఉదయం రాజ్యసభ ఛాంబర్‌లో ప్రమాణస్వీకారం చేశారు.
Had an excellent interaction with the newly elected @BJP4India Rajya Sabha MPs. It was wonderful to hear their views and passion towards public service. This is a group of MPs who are diverse and will certainly make effective contributions to Parliamentary proceedings. pic.twitter.com/IEEAUUrxHp
— Narendra Modi (@narendramodi) July 22, 2020
వీరిలో 36 మంది తొలిసారి రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 61 మంది సభ్యులు రాజ్యసభకు ఇటీవల ఎన్నిక కాగా, వీరిలో 43 మంది తొలిసారి పెద్దలసభలో అడుగుపెడుతుండటం విశేషం.