ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా “మా వందే” అనే కొత్త బయోపిక్ రూపొందనుంది. ఈ చిత్రంలో మోడీ పాత్రలో ఉన్ని ముకుందన్ నటించబోతున్నారు. అత్యాధునిక సాంకేతికతతో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా మోడీ జీవితంలోని కీలక ఘట్టాలను, ముఖ్యంగా తల్లి హీరాబెన్ మోదితో ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించమన్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉండగా… ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, మోదీ పుట్టినరోజు కావడంతో అతనికి అభిమానులు పంపిన బహుమతులను వేలం వేస్తున్నారు. ప్రతి సంవత్సరం మోడీ పుట్టినరోజున ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 1300 పైగా మోడీకి అభిమానులు పంపిన బహుమతులు ఉన్నాయి. వీటిని ఆన్లైన్ లో వేలం వేస్తున్నారు. ఈ వేలం ఈరోజు నుంచి అక్టోబర్ రెండు వరకు జరుగుతుంది. ఈ వస్తువులు ప్రస్తుతం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ లో ప్రదర్శనలో ఉండబోతున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్ ద్వారా వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.