ఏపీ మహిళ కవితకు ప్రధాని మోదీ కితాబు

-

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన మన్‌కీ బాత్‌ ప్రసంగంలో ఏపీకి చెందిన మహిళ గురించి ప్రస్తావించారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన తాటిచెర్ల విజయదుర్గ కవితను ప్రశంసించారు. ఏటా ఐక్యతా దినోత్సవంగా జరుపుకొనే సర్దార్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన దేశభక్తి గీతాలు, లాలిపాటలు, ముగ్గుల పోటీలకు దేశవ్యాప్తంగా వచ్చిన ఎంట్రీల గురించి మాట్లాడుతూ ఆయన విజయదుర్గ కవితను గుర్తు చేశారు.

‘ఈ పోటీల్లో 700కు పైగా జిల్లాల నుంచి 26 భాషల్లో 5 లక్షల మందికిపైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు. అందరిలోనూ ఒక ఛాంపియన్‌ ఉన్నారు. దేశ వైవిధ్యం, సంస్కృతిపై ప్రేమను ప్రదర్శించారు’ అని ప్రధాని కవిత గురించి ప్రస్తుతించారు. ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందిన కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాకు చెందిన బీఎం మంజునాథ్‌ కన్నడలో, అస్సాంలోని కామరూప్‌ జిల్లాకు చెందిన దినేశ్‌ గోవాలా అస్సామీలో రాసిన లాలిపాటలను ప్రధాని గుర్తుచేశారు. దేశభక్తి గీతాల పోటీలో విజేతగా నిలిచిన గృహిణి, కవయిత్రి విజయదుర్గ పేరు ఉటంకిస్తూ ఆమె రాసిన కవితా పంక్తులను చదివారు.

విజయదుర్గ రాసిన గీతమిది..

‘రేనాటి సూర్యుడా.. వీరనరసింహుడా..

భారత స్వాతంత్య్ర సమరపు అంకురానివి నీవురా..

అంకుశానివి నీవురా..

తెల్లదొరల నీతిలేని నిరంకుశపు దమనకాండకు..

సలసలమని మరిగిన నీ నెత్తుటి ఎర్రని కాకలు..

రేనాటి సూర్యుడా.. వీరనరసింహుడా..’

Read more RELATED
Recommended to you

Exit mobile version