జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిసినట్లు ప్రధాని మోదీ చెప్పారు. తనపై కేసీఆర్ ఎప్పుడు లేనంత ప్రేమ, అభిమానం కురిపించారని తెలిపారు. శాలువా, పూలతో తనను సత్కరించారని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుందని..జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయాలని కోరినట్లు మోదీ తెలిపారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం దేశ ప్రగతిలో దూసుకుపోతుందని.. తనను కూడా ఎన్డీఏలో చేర్చుకోవాలని కోరినట్లు మోదీ పేర్కోన్నారు. కానీ కేసీఆర్ ప్రతిపాదనకు తాను ఒప్పుకోలేదన్నారు. తాము ప్రతిపక్షంలో అయినా కూర్చుంటాం కానీ..తెలంగాణ ప్రజలను మోసం చేయమని చెప్పానన్నారు.
మొన్న రూ.13500 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మోదీ ఈరోజు నిజామాబాద్ లో కూడా 8 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో భారీ స్పందన వచ్చింది. పసుపు కొమ్ములతో చేసిన దండను వేసి మోదీకీ కృతజ్ఞతలు తెలియజేసారు అక్కడి పసుపు రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే.. నా కుటుంబ సభ్యులారా.. అంటూ స్పీచ్ ప్రారంభించిన మోదీ చివరి వరకు ఘాటైనా విమర్శలు చేశారు. ఒక్కో మాట తుటాల్లా పేలాయి. నా స్పీచ్ ప్రారంభించే ముందు ఈ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చిందంటూ భారత మాత వేషధారణ వేసిన చిన్నారిని సంబోధిస్తూ సభకు వచ్చిన ఆ చిన్నారికి నా తరుపున అభినందనలు అని అన్నారు. మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడం.. చాలా సంతోషంగా ఉందని.. ఎన్టీపీసీ సూపర్ పవర్ థర్మల్ యూనిట్‌కు శంకుస్థాపన చేసే అవకాశం దక్కిందని.. అలాగే మహిళలు, సబ్బండ వర్గాలు నన్ను ఆశీర్వదించేందుకు ఇక్కడికి వచ్చారని వ్యాఖ్యానించారు.