బోయపాటి శ్రీను తో మెగాస్టార్ చిరు మూవీ ?

-

మెగాస్టార్ చిరంజీవి వయసు పైబడుతున్న వరుస సినిమాలలో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఈమధ్యన రిలీజ్ అయిన భోళా శంకర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి మెగాస్టార్ కెరీర్ లో ఆచార్య తర్వాత మరో ప్లాప్ వచ్చి చేరింది. అందుకే చిరంజీవి ఈ ప్లాప్ ను పూడ్చుకోవడానికి భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి మరో సినిమాను లైన్ లో పెట్టారట. ఈ సినిమాకు మాస్ కా బాప్ బోయపాటి శ్రీను డైరెక్టర్ గా వ్యవహరించిననున్నట్లు తెలుస్తోంది. తాజాగా బోయపాటి డైరెక్టర్ గా వచ్చిన స్కంద మూవీ హిట్ కావడంతో చిరంజీవి బోయపాటితో సినిమా తీయాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే గతంలోనే బోయపాటి శ్రీను చిరంజీవికి ఒక లైన్ చెప్పారట… ఇప్పుడు ఆ లైన్ ను డెవెలప్ చేసుకోవాలంటూ చిరు చెప్పడంతో శ్రీను ఆపనిలో పడ్డాడని తెలుస్తోంది. అయితే బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ కు చిరంజీవి సరిపోతాడా అన్నది సందేహమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version