దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం వర్చువల్ విధానంలో రూ. 13500 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. కుటుంబసభ్యుల్లారా అంటూ తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. పాలమూరు సభలో ప్రజలందరకీ నమస్కారములు అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోడీ. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసానని అన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తెలంగాణలో అవినీతిరహిత పాలన రావాలి.
తెలంగాణ మార్పు కోరుకుంటోందన్నారు ప్రధాని మోడీ. నాలుగేళ్ల కాలంలో ప్రజలు బీజేపీని బలోపేతం చేశారని, మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, అబద్దాలు, వాగ్ధానాలు కాదు.. క్షేత్ర స్థాయిలో పనులు తెలంగాణకు కావాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ సోదరీమనులకు కల్పించేందుకు ప్రయత్నం. మహిళల జీవితాన్ని మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు చేపట్టాం. రాణి రుద్రమలాంటి వీరనారీమణులు పుట్టిన గడ్డ తెలంగాణ గడ్డ. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉందని మోడీ అన్నారు.