బ్రేకింగ్ : కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోడీ

-

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ కరోనా టీకా వేయించుకున్నారు. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌ లో కొవిడ్‌ టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడికి జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు వేగంగా చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదని ఆయన అన్నారు. అలానే ఆయన వ్యాక్సిన్ తీసుకుంటున్న పిక్ కూడా షేర్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు కొవిడ్‌ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్న మోడీ సమష్టి కృషితో భారత్‌ను కరోనా రహిత దేశంగా మారుద్దామని అన్నారు. అయితే దేశీయంగా తయారైన భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను ప్రధాని వేయించుకోవడం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version