“పీఎం మోడీ పంజాబ్ ఘ‌ట‌నకు కార‌ణం మేమే” : సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్

-

పంజాబ్ ప‌ర్య‌ట‌నలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని కొంత మంది అడ్డుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌ధాన మంత్రి మోడీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. అయితే ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా పెను సంచ‌ల‌నంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. అంతే కాకుండా ఈ ఘ‌ట‌న పై సుప్రీం కోర్టులో కూడా విచార‌ణ జ‌రుగుతుంది. అయితే తాజా గా పంజాబ్​లో ప్రధాని కాన్వాయ్ నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ప్రకటించింది.

అలాగే ఈ కేసు విచార‌ణ కూడా జ‌ర‌ప‌వ‌ద్ద‌ని సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తుల‌ను బెదిరించింది. ఈ విష‌యాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీం కోర్టు ధర్మాస‌నాకి తెలిపింది. త‌మ‌ను ఈ కేసు విచార‌ణ నుంచి త‌ప్పుకోవాల‌ని దర్యాప్తును నిలిపివేయాలంటూ బెదిరింపు కాల్స్ వ‌చ్చాయ‌ని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం తెలిపారు. ఖ‌లిస్థానీ వేర్పాటు వాద సంస్థ అయిన సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్ నుంచి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news