దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. మృత్యుఘంటికలు మొగిస్తుంది. రోజురోజుకి తీవ్రతను పెంచుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో ముఖ్యమంత్రులతో మాట్లాడేందుకు షెడ్యూల్ రూపొందించారు. 16వ తేదీ (మంగళవారం) పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల సీఎంలతో ఈ నెల 17న మాట్లాడనున్నారు. ఆ రోజున తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో కరోనా కట్టడికి కొత్త మార్గాలు విధించే అంశాలపై చర్చించనున్నారు. అలాగే మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించే అంశాలపై కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది.