తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు తెలుగులో ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ‘తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను.’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
అయితే ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 29న తెలుగు రాష్ట్రాలు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాయి. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి పంతులు జన్మదినం సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తరువాత కాళోజీ జన్మదినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు.
తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాల పై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను.— Narendra Modi (@narendramodi) August 29, 2020