Breaking : రిషి సునాక్‌కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ

-

లిజ్ ట్రస్ రాజీనామా నేపథ్యంలో బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ (42) ఎన్నికవడం తెలిసిందే. భారత సంతతికి చెందిన రిష సునాక్‌ ప్రధానిగా ఏకగ్రీకం కావడంతో భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా రిషి సునాక్ కు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2030 రోడ్ మ్యాప్ అమలు, ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. భారత్, బ్రిటన్ మధ్య చారిత్రక సంబంధాలు ఇకపై ఆధునిక తరం భాగస్వామ్యంలోకి అడుగుపెడుతున్నాయని మోదీ పేర్కొన్నారు.ఈ సందర్భంగా బ్రిటన్ లోని భారతీయులకు మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రిటన్ లోని భారతీయులు ఇరుదేశాల మధ్య మానవ వారధి లాంటి వారని అభివర్ణించారు.

గతంలో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ అంతర్గత ఎన్నికల్లో ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌పై పోటీచేసి ఓటమిపాలైన  రిషి సునాక్  కొద్ది వారాల్లోనే బ్రిటన్ లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఏకగ్రీవంగా ప్రధాని పదవికి ఎన్నికై బ్రిటన్‌ రాజకీయాల్లో సృష్టించారు. అక్టోబర్ 28 న రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చెపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version