రేపే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి : రైతుల అకౌంట్లలో 18 వేల కోట్లు

-

 రేపు అంటే డిసెంబర్ 25న మధ్యాహ్నం 12 గంటలకు ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా  నరేంద్ర మోడీ విడుదల చేయనునన్నారు. 9 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు 18 వేల కోట్ల రూపాయలు పైగా  పి.ఎం  కిసాన్ సమ్మాన్ నిధి నుంచి బదిలీ కానున్నాయి.  ఈ కార్యక్రమంలో  ఆరు రాష్ట్రాల రైతులతో కూడా ప్రధాని మోడీ సంభాషించనున్నారు. 

narendra modi

ప్రధానితో రైతులు పి.ఎం కిసాన్ పథకంతో తమ అనుభవాలను పంచుకుంటారు.  రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తెచ్చిన వివిధ పధకాల గురించి రైతులతో నేరుగా ప్రధాని మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా హాజరుకానున్నారు. ఒకపక్క రైతులు కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న తరుణంలో మోడీ రైతులకు నిధులు రిలీజ్ చేయడం అలానే కొన్ని రాష్ట్రాల రైతులతో మాట్లాడుతుండడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version