పీఎం కిసాన్ – న‌గ‌దు రైతుల ఖాతాల్లోకి పడ్డాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?

-

పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి న‌గ‌దు రైతుల ఖాతాల్లోకి వేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 25వ తేదిన మ‌ద్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నిధులను రిలీజ్ చేస్తారు. ఈమేర‌కు పీఎం కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ద‌ఫా రూ. 18 వేల కోట్ల రూపాయ‌ల‌ను రైతుల అకౌంట్ల‌లోకి జ‌మ చేయ‌నున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 9 కోట్ల రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అంద‌నుంది.

 

ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం ద్వారా ప్ర‌తి ఏడు అర్హులైన రైతుల‌కు 6వేల రూపాయ‌ల‌ను ఆర్థిక సాయంగా అందిస్తున్న విష‌యం తెలిసిందే. మూడు ధ‌పాలుగా అంటే 2 వేల రూపాయ‌ల‌ను 4 నెల‌ల‌కు ఒక‌సారి ఏడాదికి మూడు సార్లు జ‌మ చేస్తున్నారు.

డ‌బ్బులు ప‌డ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి..

పీఎం కిసాన్ నిధి ఆర్థిక‌సాయం తమ ఖాతాలో పడిందా లేదా అనే విష‌యాన్ని రైతులు pmkisan.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌లో Kisan Corner అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత స్టేటస్‌లోకి వెళ్లాలి. అక్కడ లబ్దిదారులు తమ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, గెట్ రిపోర్ట్‌ను క్లిక్ చేస్తే పూర్తి వివరాలు పొంద‌వ‌చ్చు.

ఒకవేళ న‌గ‌దు రైతుల అకౌంట్‌లోకి జ‌మ‌కాక‌పోయినా.. రిపోర్టులో FTO (Fund Transfer Order) అని వచ్చినట్టయితే.. లబ్దిదారులు నిరాశ చెందాల్సిన పని లేదు. త్వరలోనే మీ ఖాతాలో డబ్బులు వేస్తారని అర్థం.

పీఎం కిసాన్ టోల్‌ఫ్రీ నంబర్ (PM Kisan Toll free number): 18001155266.

పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ ( PM Kisan Helpline number): 155261.

పీఎం కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు (PM Kisan landline numbers): 011—23381092, 23382401, 011-24300606. 0120-6025109.

పీఎం కిసాన్ ఈమెయిల్ ఐడీ: pmkisan-ict@gov.in .

Read more RELATED
Recommended to you

Exit mobile version