పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర జలశక్తి శాఖ ఒక్కోసారి ఒక్కో విధంగా సమాచారం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారుతోంది. ప్రజలు సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగిన ప్రతీ సారీ ఒక్కో విధంగా సమాధానిమచ్చారు కేంద్ర జల శక్తి అధికారులు. 2014 ఏప్రిల్ 1 తేదీ నుంచి పోలవరం ప్రాజెక్టుకు అయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుందంటూ ఏప్రిల్ నెలలో సమాచార హక్కు చట్టం కింద స్పష్టం చేసింది.
పునరావాస ప్యాకేజీతో కలిపిన ఇరిగేషన్ కాంపోనెంట్ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు స్పందిస్తూ ఈ సమాధానమిచ్చింది. ఇదే విషయంపై సెప్టెంబర్ నాటికి కేంద్ర జల శక్తి శాఖ మాట మార్చేసింది. మరో ఆర్టీఐ దరఖాస్తుకు స్పందించిన కేంద్రజలశక్తిశాఖ.. ప్రాజెక్టులోని 2013-14 ధరల ప్రకారం ఇరిగేషన్ కాంపోనెంటుకు మాత్రమే చెల్లిస్తామని తెలిపింది. నాలుగు నెలల్లోనే భిన్నమైన సమాధానం చెప్పటంపై ఇప్పుడు చర్చనీయాంశం అయింది.