వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అరెస్ట్..!

-

కాన్పూర్ లో డీఎస్పీతో స‌హా 8 మంది పోలీసుల‌ను దారుణంగా హతమార్చిన గ్యాంగ్‌ స్టర్‌ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు దయా శంకర్ అగ్ని హోత్రిని యూపీ పోలీసులు కల్యాణ్‌ పూర్‌ లో అరెస్టు చేశారు. అగ్ని హోత్రిని అరెస్టు చేసేందుకు వెళ్ళిన పోలీసులపైకి అతను కాల్పులు జరపడంతో ఎన్‌ కౌంటర్ జరిగిందని కాన్పూర్ పోలీసులు తెలిపారు. ఎన్‌ కౌంటర్‌లో అగ్ని హోత్రి కాలుపై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

అతని వద్ద నుంచి ఓ తుపాకీ, కార్ట్రిడ్జ్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు గురువారం రాత్రి కాన్పూర్ లోని బిక్రూ గ్రామంలో వికాస్ దూబే గ్యాంగ్, పోలీసుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ గురించి దయా శంకర్ అగ్నిహోత్రి మీడియాకు తెలిపాడు. కాల్పుల ఘటనకు ముందు వికాస్ ను అరెస్ట్ చేయబోతున్నట్లు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పాడు. దీంతో సుమారు 25 నుంచి 30 మంది అనుచరులను రప్పించాడని, అక్కడికి వచ్చిన పోలీసులపై అతడు కాల్పులు జరిపాడని దయాశంకర్ తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version