ఉస్మానియా యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. శనివారం ఉదయం పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. యూనివర్సిటీలోని ఆయన క్వార్టర్ డోర్లు పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అయితే ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖాసింను పోలీసులు అరెస్ట్ చేశారు. విరసం కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన ప్రొఫెసర్ ఖాసింకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో శనివారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.
దాదాపు ఐదు గంటలుగా సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, రెండు బ్యాగుల విప్లవ సాహిత్యం, కరపత్రాలను గజ్వేల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ ఖాసింను పోలీసులు అదుపులోకి తీసుకుని గజ్వేల్‌కు తరలించారు. కాగా ప్రొఫెసర్ ఖాసిం ఇంట్లో పోలీసుల సోదాలను విద్యార్థులు ఖండించారు. ఓయూలోని ఖాశిం నివాసం ఎదుట విద్యార్థులు ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.