సాధారణంగా మనుషులు ఎంత ఎత్తు ఉంటారు. నాలుగు అడుగుల నుంచి ఉంటారు. నాలుగు అడుగులు ఎక్కడో అర్దుగా కాని నేపాల్ కి చెందిన ఒక వ్యక్తి మాత్రం రెండు అడుగులు మాత్రమే. అతనే నేపాల్‌కి చెందిన ఖగేంద్ర థాపా మాగర్. అతని ఎత్తు ఎంత అంటే, 67.08 సెంటీమీటర్లు అంటే 2 అడుగుల 2.41 ఇంచుల ఎత్తు మాత్రమే. ఉంటాడు. అతను నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో నివాసం ఉంటాడు.
సాధారణంగా అంత పొట్టిగా ఉండే వ్యక్తి నడవడం అనేది చాలా కష్టం. కాని అతను చాలా హుషారుగా నడుస్తాడు. పొట్టిగా ఉంటూ కూడా నడవగలుగుతున్న వ్యక్తిగా గిన్నీస్ బుక్ ని ఆకర్షించాడు. 2010లో ఖగేంద్రను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చేర్చారు. అప్పుడు అతని వయసు 18 ఏళ్ళు అన్న మాట. ఇక్కడ విశేషం ఏంటీ అంటే గిన్నీస్ బుక్ వారు ఇచ్చిన సర్టిఫికేట్ అతని కంటే పొడుగు ఉండటమే.
అయితే ఇప్పుడు అతను లేడు. అనారోగ్యంతో మరణించాడు. ఖాట్మండుకి 200 కిలోమీటర్ల దూరంలోని పోఖారాలో ఉన్న ఆస్పత్రిలో నిమోనియోకి వైద్యం తీసుకుంటూ ఖగేంద్ర కన్నుమూసాడు. అతనికి గతంలో కూడా నిమోనియా సమస్య ఉంది. ఈసారి అది తీవ్రమై గుండెపైనా ప్రభావం చూపడంతో ఖగేంద్ర చనిపోయినట్లు అతని సోదరుడు మహేష్ థాపా మాగర్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం పలువురు అతనికి సంతాపం ప్రకటిస్తున్నారు.
Shortest living MAN :#KhagendraThapaMagar is 27 Years Old and measures 67.08 cm (2ft 2.41 in ) tall
Courtesy @GWR #Guinness#ThursdayMotivation pic.twitter.com/ENHAy8Ts4s
— Thand?ra Times (@thandoratimes) January 2, 2020