‘జాన్’ మూవీ అప్ డేట్ ఇచ్చిన ప్రభాస్….ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…..!!

-

బాహుబలి రెండు భాగాలతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ తో పాటు అమాంతం తన మార్కెట్ రేంజ్ ని పెంచేసుకున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్, ఇటీవల సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఆశించిన స్థాయిలో ఆ సినిమా సక్సెస్ కాలేక, ఆయన ఫ్యాన్స్ కు నిరాశను మిగిల్చింది. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు ప్రభాస్, గోల్డెన్ లెగ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాను యువి క్రియేషన్స్ తో పాటు ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు తన గోపి కృష్ణ మూవీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ఒక హృద్యమైన ప్రేమకథగా తెరెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సగం పూర్తి అయిందని, అలానే ఈ దీని తాజా షెడ్యూల్ నేడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానుందని సమాచారం. ఇకపోతే ఈ షెడ్యూల్ గురించి స్వయంగా రెబల్ స్టార్ ప్రభాస్, కాసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్ లో ఒక కీలక పోస్ట్ చేసారు. నేను నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది, మంచి ఫన్ మూమెంట్స్ తో కూడిన లేటెస్ట్ షెడ్యూల్ నేడు ప్రారంభం కానుంది,

 

నేను కూడా మీకు మాదిరిగానే సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ప్రభాస్ పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆ పోస్ట్ కు వేలాది లైక్స్ దక్కుతున్నాయి. కాగా ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, ఇటీవల సమంత, శర్వానంద్ నటిస్తున్న 96 మూవీ రీమేక్ కు జాను అనే టైటిల్ ని ఫిక్స్ చేయడంతో, ప్రభాస్ సినిమాకు జాన్ అనే టైటిల్ మార్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది……!!

Read more RELATED
Recommended to you

Exit mobile version