బ్రేకింగ్ : టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్ 

-

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి అరెస్ట్ అయ్యారు. ఆయనని కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు అనే ఆరోపణలతో రవీంద్ర పై కేసు  నమోదు అయ్యింది.  ఈ క్రమంలో ఉదయం  6 గంటలకు పోలీసులు రవీంద్ర ఇంటికి వెళ్లారు.  ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు అనే ఆరోపణలతో కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.

దీంతో కొల్లు రవీంద్ర ఇంటికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఇక గతంలో కూడా ప్రస్తుత మచిలీపట్నం ఎమ్మెల్యే, మంత్రి పేర్ని నాని అనుచరుడు ఒకరిని చంపిన వారికి సహకరించారు అనే ఆరోపణతో అరెస్ట్ అయ్యారు కూడా. ఆయన మరో మారు అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version