రద్దీగా ఉన్న బస్సులే వాళ్ల టార్గెట్‌.. 9మంది చైన్‌ స్నాచర్లు అరెస్ట్

-

చైన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వరుస దొంగతనాలు చేస్తున్న 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు..వారి నుంచి 9 తులాల 3 గ్రాముల గోల్డ్ చైన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్న ప్రయాణికులే వీరు టార్గెట్ చేసి చోరీలు చేస్తున్నారని డీసీపీ శిల్పవళ్లి తెలిపారు. బస్సుల్లో ప్రయాణిస్తూ.. స్నాచింగ్ లకు పాల్పడుతారన్నారు. కొందరు ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ..మరికొందరు ఫుట్ బోర్డు లో ఉంటూ అందరూ కలిసి దొంగతనాలు చేస్తారన్నారు.

ఈ ముఠాలోని మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు డీసీపీ శిల్పవల్లి తెలిపారు. నిందితులంతా విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడి ఈ తరహా దొంగతనాలకు అలవాటు పడ్డారని, రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సుల్లో బంగారు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఈ ముఠా పక్కా ప్లాన్ ప్రకారం కేవలం బంగారం ధరించిన మగవారినే గుర్తించి చోరీలకు పాల్పడతారని, బస్టాండ్‌లలో నిలుచుని ముందే తాము చోరీ చేయాలనుకునే వారిని ఎంపిక చేసుకుంటారని, వారిని అనుసరిస్తూ బస్సు రద్దీగా ఉన్నప్పుడు, వారు తమ చేతివాటం ప్రదర్శిస్తారని తెలిపారు. కొంతమంది స్నాచర్లు బస్సు ఫుట్‌బోర్డుల దగ్గర నిలబడి, బాధితులను చుట్టుముట్టి వారిని తాకడం ద్వారా వారి దృష్టిని మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆ తర్వాత వారు బస్సు ఫుట్‌బోర్డ్ వద్ద నిలబడి ఉన్న ఇతర స్నాచర్‌లకు బంగారు గొలుసులను పాస్ చేస్తారని, వారు అక్కడి నుండి తప్పించుకుంటారని, తర్వాత ఈ ముఠా అంతా కలిసి బంగారు గొలుసులను సమాన వాటాలో పంచుకుంటారని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version