ఈ రోజు కాసేపటి క్రితమే ఏపీలో జనసేన రాజకీయ పొత్తులపై మాట్లాడిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలలో సారాంశం మాత్రమే వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయడం లేదన్నది స్పష్టంగా తెలిసింది. కాగా ఒక విషయం మాత్రం క్లారిటీ గా చెప్పాడు. ఇన్ని రోజులు రాజకీయ వర్గాలు పవన్ సీఎం అవుతాడని అందుకోసం చంద్రబాబును అడుగుతున్నాడని వ్యాఖ్యలు వినిపించాయి. వీటిపై కూడా పవన్ చాలా ఘాటుగా స్పదించారు.. పవన్ మాట్లాడుతూ సీఎం అభ్యర్థిగా ఉండాలంటే కనీసం 40 స్థానాలలో గెలిచి తీరాలి. అప్పుడే సీఎం అభ్యర్థి అయ్యే కనీసం హక్కు వస్తుంది.
పవన్ కళ్యాణ్: సీఎం ను చెయ్యమని టీడీపీ, బీజేపీ లను నేను అడుక్కోను !
-