సెట్లో గొడవ చేసిన సీనియర్ యాక్టర్ కేసు నమోదు..!!

-

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ విలన్ షాయాజీ షిండే అప్పటి నుంచి తెలుగులో మంచి పాపుారిటీ సంపాదించు కున్న విషయం తెలిసిందే. తన దైన శైలి నటన లో టిపికల్ డైలాగ్ డెలివరీ తో ఆయన ప్రేక్షకులను అమితంగా అలరించారు.

అయితే ప్రస్తుతం తాను మరాఠీ భాషలో చేస్తున్న ఒక సినిమా వల్ల చిక్కుల్లో పడ్డారు.మరాఠీ నిర్మాత సచిన్ సనన్ తాజాగా షాయాజీ షిండే పై పోలీసుకు ఫిర్యాదు చేశారు. తన సినిమాలో నటిస్తానని రూ. 5 లక్షలు తీసుకుని నటించకపోగా తిరిగి ఇవ్వలేదని తన వల్ల రూ.17 లక్షలు డబ్భులు పోయాయని కేసు పెట్టాడు.

తాను ఒప్పుకున్నట్లు గా సినిమాలో నటించ కుండా కాకుండా ముందు అనుకున్న కథలో తన పాత్రకు మార్పులు చేయమన్నాడని అది కుదరదని చెప్పడంతో సెట్ లో గొడవ చేశాడని పేర్కొన్నారు. ఆయన చేసిన గొడవ కారణంగా సెట్ లో ఆ రోజు చేయాల్సిన  షూటింగ్ ఆగిపోయిందని ఆ కారణంగా తాను రూ. 17 లక్షలు నష్టపోవాల్సి వచ్చిందని ఈ నష్టం మొత్తం తనకు తిరిగి ఇప్పించాలని పోలీసులకు పిర్యాదు చేసినట్లు గా తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version