Breaking : హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

-

హైదరాబాదులోని చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద బాంబు కలకలం రేగింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ చార్మినార్‌ ప్రాంతంలో పోలీసుల సోదాలు చేపట్టారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే సోమవారం చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, దుకాణాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది గమనించిన కొంతమంది భయపడి బాంబు కోసమే తనిఖీలు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు చార్మినార్‌కు ఎలాంటి బాంబు బెదిరింపు కాల్ రాలేదని.. ఇదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు.

చార్మినార్‌ వద్ద సాధారణ తనిఖీలే చేపట్టామని వెల్లడించారు. ఇదే విషయమై చార్మినార్‌ ఎస్‌ఐ స్పందించారు. పోలీసులకు ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాలేదని చెప్పారు. బాంబు బెదిరింపులు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టివేశారు. సాధారణ తనిఖీలేనని పాతబస్తీ పోలీసులు తెలిపారు. ఎలాంటి బాంబు బెదిరింపులు రాలేదని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version